ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది.వరుస స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకున్న అమ్మడు కెరియర్ ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందట.
అయితే ఇన్ని సంవత్సరాలైనా సరే తన స్టాఫ్ ను మాత్రం తన మొదటి సినిమాకు పని చేసిన వారినే ఉంచిందట.కాస్త క్రేజ్ రాగానే తమ దగ్గర పనిచేసే వారి మీద తమ టెక్కు చూపించే ఈరోజుల్లో సమంత 7 ఏళ్లుగా ఒకే టీంతో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప విషయం.
అంతేకాదు ఇదో రకంగా ఆమె మంచి మనసుని తెలియచేస్తుంది కూడా.ఓ పక్క సినిమాలు చేస్తూనే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ధీర్ఘకాళిక రోగాలున్న అనాధలకు సహాయం చేస్తున్న సమంత నిజంగా మంచి మనసు గలదని చెప్పాలి.
సరదాగా షూటింగ్ గ్యాప్ లో తన టీంతో ఓ సెల్ఫీ దిగి ‘నా లవ్ లీ టీం’ సక్సెస్ ఫుల్లీ కంప్లీట్స్ 7 ఇయర్స్ అని ట్వీట్ చేసింది సమంత.ఇది చూసిన వారు అందరు సమంత నువ్వు సూపరంతే అనేస్తున్నారు.
.






