కబాలి రిజల్ట్ చూశాక రంజిత్ కు అవకాశం ఇస్తాడా..?

సూపర్ స్టార్ రజినికాంత్ కబాలిగా చూపించి ట్రైలర్ లో వారెవా అనిపించిన దర్శకుడు పా.రంజిత్ ఆ సినిమా ఫలితంతో ఢీలా పడిపోయాడు.

ఓ స్టార్ హీరోతో సినిమా చేసేప్పుడు కథనంలో ఎంత పట్టు ఉండాలన్న విషయాన్ని మరచిన దర్శకుడు సినిమా ఫలితంతో ఎన్నో అపవాదాలు మూట కట్టుకుంటున్నాడు.అయితే ఈ సినిమా షూట్లో ఉన్నప్పుడే ఈ డైరక్టర్ కు సూర్య అవకాశం ఇస్తున్నట్టు టాక్ వచ్చింది.

కబాలి తర్వాత సూర్యతోనే పా.రంజిత్ సినిమా అన్నారు కూడా.కబాలి రిజల్ట్ చూశాక సూర్య తన నిర్ణయం మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేవలం కబాలి సినిమా దర్శకుడి తప్పిదాల వల్లే అలాంటి రిజల్ట్ తెచ్చుకుంది.మరి అతన్ని నమ్మి సూర్య అపజయం వచ్చాక కూడా అవకాశం ఇస్తాడా అన్నది తెలియాల్సిన విషయం.

Advertisement

ప్రస్తుతం సింగం-3 షూట్లో ఉన్న సూర్య రంజిత్ కథను ఓకే చేసినా ఇంకా వేరే దర్శకుల కథను కూడా వింటున్నాడట.మరి సూర్య రంజిత్ ల సినిమా ఉంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు