మహేష్ బాబు ఇప్పటివరకు 22 సినిమాల్లో నటించాడు.మురుగదాస్ తో చేయబోయేది 23వ సినిమా.
దాని తరువాత ఎవరు? చాలారోజులుగా ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నాయి.విక్రమ్ కుమార్ కి అవకాశం దొరికినట్టే అని చాలామంది అనుకుంటున్న తరుణంలో, మహేష్ తన లైనప్ లో మార్పులు చేసాడు.
కొరటాల శివ మళ్ళీ మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నారని తెలుగుస్టాప్ ఇప్పటికే తెలిపింది.మురుగదాస్ సినిమా తరువాత దాదాపుగా, మహేష్ – కొరటాల కాంబినేషన్ ఖరారు అయిపోయినట్లే.
డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయిపోయాడు.ఇది 24వ సినిమా.
వాస్తవానికి మహేష్ 25వ సినిమా రాజమౌళి చేయాలి.ఈ సినిమా కోసమని దుర్గ ఆర్ట్స్ నుంచి ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నారు మహేష్ – రాజమౌళి.
కాని ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించటల్లేదు.బాహుబలికి మూడొవభాగం కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథ వినిపించటం, దాన్ని మహేష్ ఓకే చేయటం జరిగిపోయాయి.ఇది 25వ సినిమా అని ఫిలింనగర్ ప్రజల సమాచారం.








