ఆరున్నర అడుగుల ఎత్తుతో చూడగానే పెద్దమనిషిలా కనిపిస్తారు సత్యరాజ్.తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన `మిర్చి` చిత్రం నుంచి తెలుగులో కూడా కేరక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు.
సత్యరాజ్ నటిస్తే సినిమా హిట్ అవుతుందనే పాజిటివ్ టాక్‌ను కూడా సొంతం చేసుకున్నారు.ఈ గోల్డెన్ లెగ్ స్టార్ తాజాగా తమిళంలో `జాక్సన్ దురై` పేరుతో ఓ సినిమాలో నటించారు.
ఆ చిత్రం తెలుగులో `దొర`గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో ఆయన సొంత తనయుడు శిబిరాజ్ కీలక పాత్రను పోషించారు.
తెలుగువారికి సుపరిచితురాలైన తెలుగు ఆడపడుచు బిందు మాధవి నాయికగా నటించింది.ఈ వారంలోనే పాటలను, జులై 1న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జక్కం జవహర్‌బాబు నిర్ణయించారు.
రత్నా సెల్యూలాయిడ్స్ పతాకంపై ఆయన అనువదించిన చిత్రమిది.ఈ చిత్రం గురించి
నిర్మాత జక్కం జవహర్‌బాబు మాట్లాడుతూ
“చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో, తండ్రి పాత్రల్లో సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తమిళంలో ఓ పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌లో నటించారు.`జాక్సన్ దురై` పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో `దొర` పేరుతో విడుదల చేస్తున్నాం.
మా రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై అనువదిస్తున్నాం.ధరణీధరన్ దర్శకత్వం వహించారు.
సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు.బిందుమాధవి నాయిక.
కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.తెలుగు, తమిళంలో జులై 1న ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీలను అందించారు.వెన్నెలకంటిగారు, చంద్రబోస్‌గారు చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు.
శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగులు రాశారు.అనువాద పనులు పూర్తయ్యాయి.
త్వరలో పాటలను విడుదల చేస్తున్నాం.తమిళంలో టీజర్‌కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది.
ఇటీవలి కాలంలో వైవిధ్యమైన హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.ఆ కోవలో `దొర` కూడా తప్పక తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది“ అని చెప్పారు.
ఈ సినిమాకు కెమెరా: యువరాజ్, సంగీతం: సిద్ధార్థ్ విపిన్, నేపథ్య సంగీతం: చిన్నా, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: ధరణీధరన్, నిర్మాత: జక్కం జవహర్‌బాబు
.






