పాము కాటేస్తే వెంటనే ఏం చేయాలి?

పాము కాటేస్తే మూఢనమ్మకాల్లో మంత్రాలు చదవడం, ఆకులేవో దంచేసి పెట్టుకోవడం లాంటి ఇంకా జరుగుతున్నాయి మన దేశంలో.

అందుకే ప్రతి ఏట 50-70 వేలమంది పాముకాటుతో చనిపోతున్నారు.

మరి పాము కాటువేస్తే వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఇవి చేయాలి :

* వెంటనే కాటువేసిన చోటు కింద,పైనా గట్టిగా కట్టు కట్టండి, దీంతో సాధ్యమైనంత వరకు విషం మెల్లిగా వ్యాపిస్తుంది.* కాటుపడిన చోటుని ప్రతి పది నిమిషాలకు ఓసారి ఫోటో తీస్తూ ఉండండి.

ఆ ఫోటోలు డాక్టర్లకు పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి పనికొస్తాయి.* ఎలాంటి మందులు, మంత్రాలు వాడకుండా వెంటనే హాస్పిటల్ కి తరలించండి.

* గాయపడిన వారికి ధైర్యం చెబుతూ ఉండండి.పాముకాటు పడిన సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరిగితే ప్రాణాలకు ప్రమాదం.

Advertisement

ఇవి చేయకూడదు :

* విషాన్ని బయటకు పీల్చే ప్రయత్నాలు చేయకండి.* మంత్రాలు, పసరు లాంటివి పక్కనపెట్టండి.

* పాముని చంపాలన్న కసి వద్దు.ప్రతి సెకను పేషెంట్ ని కాపాడుకోవడానికి వాడండి.

* గాయాన్ని సబ్బుతో కడగడం లాంటివి చేయొద్దు.* మంచి నీళ్ళు గాని, ఇంకేలాంటి పదార్థం గాని, తినిపించడం, తాగించడం చేయకూడదు.

* కరెంట్ షాక్ ఇవ్వడమనేది పనికొచ్చే విషయం కాదు.* ఇక గాయపడిన వ్యక్తి ఆందోళనకు లోనైతే తనని తాను చంపుకున్నట్టే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

బ్లడ్ ప్రెషర్ ఎంత పెరిగితే, విషం అంత వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది.అందుకే టెన్షన్ పడకుండా, బ్రతుకుతాన్న నమ్మకంతో వైద్యుడి వద్దకు వెళ్ళాలి.

Advertisement

అవసరంలో ఈ జాగ్రత్తలు పాటించండి.పల్లెటూరిలో ఉండే వారికి ఇదంతా తెలియజేయడం మన బాధ్యత.

తాజా వార్తలు