అమెరికన్ రక్తచరిత్ర : 2023లో 19 కాల్పుల ఘటనలు, 97 మంది బలి.. తొలి నాలుగు నెలల్లోనే ఈస్థాయిలోనా..?

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్( Gun culture ) వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.కాగా.అమెరికాలో( America ) తుపాకీ కాల్పుల ఘటనలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.2023లో ఇప్పటి వరకు 100 మంది ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ( North Eastern University )భాగస్వామ్యంతో అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ఏ టుడే నిర్వహిస్తున్న డేటా బేస్ ప్రకారం.గత వారంతంలో జరిగిన కాల్పులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయట.2006 నుంచి నేటి వరకు నమోదు చేస్తున్న డేటా ప్రకారం.ఏడాదిలో తొలి నాలుగు నెలల్లో చోటు చేసుకున్న ఘటనలు ఈ సంవత్సరమే అత్యధికం.

Advertisement

మంగళవారం మధ్యాహ్నం ఓక్లహోమాలో చనిపోయిన వారి వివరాలను డేటాబేస్‌కు ఇంకా జోడించలేదు.

ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 97 మంది ప్రాణాలు కోల్పోగా (ఏప్రిల్ చివరి నాటికి 17 ఘటనలే) .ఇది 2009 (93 మంది) కంటే ఎక్కువ.నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నట్లయితే అలాంటి వాటిని డేటా బేస్ సామూహిక హత్యలుగా పరిగణిస్తోంది.2006 నుంచి అమెరికాలో చోటు చేసుకున్న సామూహిక హత్యలలో మరణించిన 2,851 మందిలో పార్క్‌లాండ్( Parkland ) బాధితులే అత్యధికం.

డేటా ప్రకారం.సగటున వారానికి ఒక ఘటన జరుగుతోంది.అంతేకాదు.గడిచిన దశాబ్ధకాలంలో భయంకరమైన సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.2019లో అత్యధికంగా ఇలాంటివి 45 ఘటనలు చోటు చేసుకోగా.2017లో ఈ తరహా ఘటనల్లో 230 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆ ఏడాది లాస్‌వెగాస్ స్ట్రిప్‌లోని( Las Vegas Strip ) ఓపెన్ కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్‌పై సాయుధుడు కాల్పులు జరపడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆధునిక అమెరికా చరిత్రలో జరిగిన సామూహిక కాల్పుల ఘటనల్లో ఇది అత్యంత భయంకరమైనదిగా విశ్లేషకులు అభివర్ణిస్తారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు