యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడడం కామనే.ప్రేయసి ప్రియుడి డేటింగ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం కూడా కామనే.
కానీ ఓల్డ్ ఏజ్ లో లవ్, డేటింగ్ అంటే వినడానికి కూడా కష్టంగా ఉంది.కానీ ఒక 85 ఏళ్ల బామ్మ మాత్రం ఇప్పటికి డేటింగ్ అంటూ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఏకంగా పేపర్లోనే ప్రకటన ఇచ్చింది.
పైగా ప్రేమకు వయసుతో సంభంధం లేదంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్స్ కూడా ఇస్తుంది.
ఆ బామ్మ తాజాగా తన 39 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పింది.
మళ్ళీ ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం సర్చింగ్ చేస్తుంది.ఈ బామ్మా న్యూయార్క్ లో ఉంటుంది.
ఆమె 48 ఏళ్ల వయసులోనే తన భర్తతో విడాకులు తీసుకుంది.అప్పటి నుండి ఆమె తన కంటే తక్కువ వయసు ఉన్న వారితో డేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టమని ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.

ఆమెకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు.ఆమె ఒకప్పుడు డాన్సర్ గా పని చేసింది.ప్రసెంట్ ఆమె రచయితగా, కోచ్ గా పనిచేస్తుంది.
ఈ వయసులో కూడా వారానికి ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంది.అయితే ఆమె వాడుతున్న డేటింగ్ యాప్స్ లో ఆమెను చాలా మంది తిరస్కరించడం తో ఆ యాప్స్ ఆమెను బ్లాక్ చేసాయి.

అందుకే ఆ బామ్మ ఇప్పుడు కొత్త డేటింగ్ యాప్స్ కోసం సర్చింగ్ చేస్తుంది.ఇప్పటికే పలు టివి ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ అందరిని ఆకట్టు కుంటుంది.ప్రస్తుతం ఆమెకు ఎవ్వరు బాయ్ ఫ్రెండ్ లేదని ఆమె తెలిపింది.అంతేకాదు తనకు 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలని ఆమె పేపర్ లో ప్రకటన ఇచ్చింది.
ఏంటో లేటు వయసులో మనవడు మానవరాళ్లతో ఆడుకోవాల్సిన బామ్మ బాయ్ ఫ్రెండ్స్ కావాలంటూ ప్రకటన ఇచ్చేసరికి అందరు ఆశ్చర్య పోతున్నారు.