విడాకులు తీసుకున్న వృద్ధ జంట, 80 ఏళ్ల వయసులో

భార్య భర్తల బంధం యవ్వనం సమయంలో కంటే కూడా వృద్ధాప్యం సమయంలోనే వారి బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఇద్దరూ కూడా 60 లు దాటిన తరువాత ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు.

ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాల్సిన ఒక జంట 80 ఏళ్ల వయసులో విడాకులు తీసుకోవడం విశేషం.ఈ ఘటన మధురై లో చోటుచేసుకుంది.

పలయం పట్టి కి చెందిన ఒక జంట సఖ్యత లేని కారణంగా గత 25 సంవత్సరాలుగా వేరు వేరుగానే ఉంటున్నారు.ఈ క్రమంలోనే వారు విడాకులు కోరడం తో దానిపై విచారించిన మదురై కోరు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.

పలయం పట్టి కి చెందిన వేలుస్వామి(82),కస్తూరి(80) లు1962 లో పెళ్లి చేసుకున్నారు.అప్పుడు ఏర్పడిన వీరి పెళ్లి బంధానికి 2019 లో ఇద్దరూ ముగింపు పలికినట్లు తెలుస్తుంది.

Advertisement

వయసు పెరిగే కొద్దీ భార్య భర్తల మధ్య అనోన్యత పెరుగుతుంది,బంధం బలపడుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు.కానీ వీరి మధ్య మాత్రం మనస్పర్థలు పెరుగుతూ వస్తూ ఉండడం తో ఈ జంట కోర్టు వరకు వెళ్లి విడాకులు తీసుకుంది.

అయితే ఇద్దరినీ కలపమని భార్య కస్తూరి కోరినప్పటికీ వేలుస్వామి ససేమిరా అనడం తో కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు