అద్భుతం చేసిన 650 మంది మహిళలు.. అందరికీ ఆదర్శం!

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో 650 మంది మహిళలు ఆలూ చిప్స్ తయారీ కంపెనీని ఏర్పాటు చేశారు.

ఆర్క్ చిప్స్ పేరుతో ఈ కంపెనీని నిర్వహిస్తున్న మొత్తం పది మంది డైరెక్టర్లు, వాటాదారులు అంతా మహిళలే.

ఇప్పటివరకు స్థానికంగా బంగాళదుంప చిప్స్ తయారీ ఫ్యాక్టరీ లేదు.ఇప్పుడు మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యింది.

దీనిని 650 మంది మహిళలు ఏర్పాటు చేశారు.షికోహాబాద్ ప్రాంతంలో ఆర్క్ చిప్స్ ఫ్యాక్టరీ ఉంది.

దీనికి 10 మంది డైరెక్టర్లు మరియు 650 మంది వాటాదారులు ఉన్నారు.ఈ మహిళలు స్వయం సహాయక సంఘానికి చెందినవారు.

Advertisement

కాగా వీరిలో ఎవరికీ వ్యాపారం చేసిన అనుభవం లేకపోవడం విశేషం.ఇంతేకాకుండా ఈ మహిళల్లో కొంతమంది మాత్రమే పాఠశాల దాటి చదువుకున్నారు.గతేడాది ఏప్రిల్‌లో ఒక్కో మహిళ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రూ.3వేలు అందించగా, డైరెక్టర్లు బ్యాంకు నుంచి అదనంగా రుణాలు తీసుకున్నారు.2021 నవంబర్‌లో తొలి పొటాటో చిప్స్‌ ప్యాకెట్‌ను సిద్ధం చేశామని, అప్పటి నుంచి కంపెనీ ఆరు లక్షల ప్యాకెట్లను విక్రయించిందని కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన సాధన యాదవ్‌ (32) తెలిపారు.‘ఇంతకుముందు మమ్మల్ని హేళన చేసినవాళ్లు ఈరోజు మమ్మల్ని గౌరవిస్తున్నారు.

ఇక్కడి మహిళలు ఎంతటి విజయం సాధించారో చూడండి అని అన్నారు.ఫిరోజాబాద్‌లోని చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చిచిత్ గౌర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలు తయారు చేసిన చిప్స్ ప్యాకెట్లు అ్యధికంగా అమ్ముడవుతున్నాయి.

ఈ చిప్స్ రుచి, ప్యాకేజింగ్ పరంగా అనేక పెద్ద బ్రాండ్ల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు