638 సార్లు అతని పై హత్యాయత్నం... చివరకు?

సాధారణంగా ఒక వ్యక్తి పై ఒకటి, రెండు సార్లు హత్యాయత్నం చేస్తే వారి నుంచి ఎలాగో తప్పించుకుని బతుకు జీవుడా అంటూ బయటపడతారు.కానీ ఒక వ్యక్తిపై 638 సార్లు హత్యాయత్నం చేసిన ఏ మాత్రం వెన్నులో భయం లేకుండా ఎదురు నిలబడి ఎదిరించిన వీరుడు ఎవరు అంటే? అతనే క్యూబా మాజీ పాలకుడు ఫిడెల్ క్యాస్ట్రోను.

క్యాస్ట్రో ఈ పేరు వింటే అగ్రదేశాలు సైతం వణికిపోయే వి.అతనొక విశ్వవ్యాప్త విప్లవానికి స్ఫూర్తిగా నిలిచాడు.అతని పేరు వింటే కమ్యూనిస్టులలో ఆనందం ఉరకలేస్తుంది.

ఎర్ర జెండా నీడలో అవిశ్రాంతంగా ముందుకు సాగిన వీరుడు.ధీరుడైన ఫిడెల్ కాస్ట్రోను చంపడానికి ఏకంగా అతనిపై 638 సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన క్యాస్ట్రో ని ఇంచు కూడా కదిలించలేక పోయారు.క్యాస్ట్రో 49 సంవత్సరాలు క్యూబా ని పరిపాలించాడు.

అగ్రరాజ్యమైన అమెరికా క్యూబా పై తన పెత్తనం చెలాయించాలనుకున్న నేపథ్యంలో క్యూబా జోలికి అమెరికా రాకుండా, అగ్రరాజ్యాన్ని గడగడలాడించాడు.ఈయన ధైర్య సాహసాలకు తట్టుకోలేక ఇతన్ని చంపేయాలని నిర్ణయించుకున్న అగ్రరాజ్యం క్యాస్ట్రో పై 600 సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు.

Advertisement

అమెరికా ఎత్తులకు, పైఎత్తులు వేసి వారి దాడిని ఎదుర్కొన్నాడు.క్యాస్ట్రో సిగార్ ను పేలుడు పదార్థాలతో నింపడం, ఆహార పదార్థాలలో విషం కలపడం, చివరికి అమ్మాయిలను ఎరగా వేసి అతనిని అంతమొందించాలని ఎన్నో సార్లు విభిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆయన ఎవరు ఏమి చేయలేకపోయారు.

ఈ విషయాన్ని సి.ఐ.ఏ రికార్డులు వివరించాయి.చివరి ప్రయత్నంగా 2000 సంవత్సరంలో పనామాలో క్యాస్ట్రో పై దాడి జరిగిన విషయం బ్రిటిష్ డాక్యుమెంటరీ "638ways to castro" అని రికార్డ్ చేసింది.2016 నవంబర్ లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన 90 యేట క్యాస్ట్రో సహజ మరణం పొందారు.

Advertisement

తాజా వార్తలు