తెలుగు రాష్ట్రాల్లో ఆ 500 థియేటర్లు పూర్తిగా మూత పడబోతున్నాయా?

కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.

ఏపీలో కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటీ అనేది ఆందోళన కలిగిస్తుంది.

షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేదు.ఇన్ డోర్‌ షూట్‌ లతో పాటు ఔట్‌ డోర్‌ షూట్‌ లు కూడా చేసుకోవచ్చు.

కాని ఎటొచ్చి సినిమాలు విడుదలకు థియేటర్ల సమస్య మొదలు అయ్యింది.గత ఏడాది దాదాపుగా 9 నెలల పాటు థియేటర్లు పూర్తిగా మూత పడే ఉన్నాయి.కాని ఈసారి మాత్రం పూర్తిగా మూసి వేయడం లేదు.50 శాతం ఆక్యుపెన్సీ తగ్గించి సినిమా థియేటర్లను నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది.ఇక థియేటర్లు కొత్తగా నైట్‌ కర్ఫ్యూ కారణంగా రెండు లేదా మూడు షోలు మాత్రమే పడే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇన్ని ఆంక్షల నడుమ థియేటర్లను నడపడం వల్ల కరెంటు బిల్లు బొక్క తప్ప వచ్చే లాభాలు ఏమీ లేవని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు భావిస్తున్నారు.ప్రముఖ నిర్మాతలు అయిన సురేష్‌ బాబు, దిల్‌ రాజుతో పాటు మరి కొందరికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 500 థియేటర్ల వరకు ఉన్నాయి.

ఇప్పుడు ఆ థియేటర్లు అన్ని కూడా మూత వేయాలని నిర్ణయించుకున్నారు.థియేటర్లను మూత వేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది అనేది వారి అభిప్రాయం.చిన్న సినిమాలు విడుదల అవుతున్నా కూడా వాటిని చూసేందుకు జనాలు వస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనుక తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రముఖ నిర్మాతల థియేటర్లు పూర్తి గా మూసి వేయడం జరిగిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.కరోనా పరిస్థితులు కుదుట పడేంత వరకు ఇదే పరిస్థితి తప్పదంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు