పాలనలో తనదైన ముద్ర వేస్తున్న జగన్....ఐదుగురు డిప్యూటీ సీ ఎం లు

ఏపీ సీ ఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా తనదైన ముద్ర వేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు.తొలుత ఆయన పాలన పై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చలు జరిపి వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

 5 Deputy C Ms For Ap State-TeluguStop.com

ఇప్పుడు తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకోవాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

-Telugu Political News

పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు తనకు అండగా ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అలానే ఇక 25 మందితో కేబినెట్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతున్న జగన్ రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మంత్రులను మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.దీనితో పాలన లో జగన్ నూతన విధానాన్ని అవలంబిస్తున్నారు.

గతంలో ఏ కేబినెట్‌లోకూడా ఇంత భిన్నమైన విధానం అనేది జరగలేదు.దీనితో జగన్ తప్పకుండా ఒక నూతన ఒరవడి తీసుకురానున్నట్లు అర్ధం అవుతుంది.

మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube