టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భారీ చిత్రాలకు పెట్టింది పేరు.ఈయన ఏ సినిమా చేసినా కూడా వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్నాయి.
అందుకే నిర్మాతలు రాజమౌళి ఎంత బడ్జెట్ అన్నా కూడా వెనకడుగు వేయకుండా సమకూర్చేందుకు సిద్దంగా ఉంటున్నారు.మగధీర చిత్రం నుండి రాజమౌళి ఇదే పంథాను కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం జక్కన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం బడ్జెట్‌కు పరిమితి పెట్టుకోకుండా జక్కన్న వర్క్ చేస్తున్నాడట.
నిర్మాత దానయ్య కూడా ఎంత అడిగితే అంత పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడట.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక భారీ షెడ్యూల్‌ను జక్కన్న చిత్రీకరిస్తున్నాడు.
రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, వెయ్యి మంది టెక్నీషియన్స్ వెయ్యి మంది ఇతరులతో కలిసి మొత్తం నాలుగు వేల మందితో చిత్రీకరణ జరుగుతోంది.దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ కోసం జక్కన్న దాదాపుగా 45 నుండి 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొన్నటి వరకు ఎన్టీఆర్‌పై చిత్రీకరణ చేసిన జక్కన్న తాజాగా చరణ్ కాంబోలో కూడా సీన్స్ చిత్రీకరిస్తున్నాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ చిత్రంను రూపొందిస్తున్నాడు.రికార్డు స్థాయి బడ్జెట్‌లో దానయ్య ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు.
ఆకాశమే హద్దుగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదల కాబోతున్నా అప్పుడే సినిమాను దక్కించుకునేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు.
మరి ఈ చిత్రం వెయ్యి కోట్లను క్రాస్ చేస్తుందా అంతకు మించి చేస్తుందా అనేది చూడాలి.







