పాలనలో తనదైన ముద్ర వేస్తున్న జగన్....ఐదుగురు డిప్యూటీ సీ ఎం లు

ఏపీ సీ ఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా తనదైన ముద్ర వేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు.

తొలుత ఆయన పాలన పై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చలు జరిపి వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇప్పుడు తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకోవాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

"""/"/ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు తనకు అండగా ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అలానే ఇక 25 మందితో కేబినెట్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతున్న జగన్ రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మంత్రులను మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

దీనితో పాలన లో జగన్ నూతన విధానాన్ని అవలంబిస్తున్నారు.గతంలో ఏ కేబినెట్‌లోకూడా ఇంత భిన్నమైన విధానం అనేది జరగలేదు.

దీనితో జగన్ తప్పకుండా ఒక నూతన ఒరవడి తీసుకురానున్నట్లు అర్ధం అవుతుంది.మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

కొత్త పార్టీ పెట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్ .. పేరేంటంటే ?