మైన‌ర్ పై 400 మంది అత్యాచారం.. సంచ‌ల‌నం రేపుతున్న ఘ‌ట‌న‌

దేశ చ‌రిత్ర‌లోనే ఇదో సంచ‌ల‌న ఘ‌ట‌న‌.ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ఊహించ‌ని విధ‌మైన అమానుష ఘ‌ట‌న‌గా దీన్ని చెప్పొచ్చు.

 400 People Raped A Minor A Sensational Incident, Rape, Sensational News, Maharas-TeluguStop.com

మ‌న దేశంలో మ‌హిళ‌ల మీద‌, చిన్నారుల మీద ఎన్నో అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి.ఎన్ని శిక్ష‌లు విధించినా ఎంత‌మంది రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు వెల్ల‌డించినా ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు మాత్రం ఆగ‌ట్లేదు.

అయితే ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న మాత్రం దేశ చరిత్ర‌లోనే అత్యంత హేయ‌మైన‌దిగా ఉంది.ఓ మైనర్ బాలిక మీద ఏకంగా 400 మంది అత్యాచారం చేశార‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయడం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

ఉద్యోగం ఆశ చూపి ఆమెను ఎదురైన వారంతా బ‌ల‌వంతంగా అత్యాచారాం చేశార‌ని త‌న ఫిర్యాదులో పేర్కొంది.మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న పెను దుమారం రేపుతోంది.

కాగా ఇందులో పోలీసులు కూడా ఉన్నార‌ని ఆమె చెప్ప‌డం పెను సంచ‌ల‌నం రేపుతోంది.అయితే ఇలు వారుస అత్యాచారాల‌తో ఆమె గ‌ర్భం దాల్చ‌గా స్త్రీ సంక్షేమ శాఖ స‌మ‌క్షంలో ఆమె ఉంటోంది.

బీడ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మైన‌ర్ బాలిక త‌ల్లి చిన్న‌ప్పుడే చ‌నిపోగా తండ్రి ఆమెకు చిన్న త‌నంలోనే పెండ్లి చేశాడు.అత్తింటి వేధింపుల‌ను త‌ట్టుకోలేక అంబేజోగై పట్టణానికి ప‌నికోసం వ‌చ్చింది.

Telugu Raped, Maharashtra, Minor Raped, Involved, Sensational, Telugu-Telugu Cri

అయితే ఆమె అవ‌సరాన్ని ఆస‌ర‌గాచేసుకున్న వారు ఆమెకు ప‌ని ఇప్పిస్తామ‌ని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.ఇక వారి స్నేహితులు కూడా ఇలాగే చేశారు.ఇలా ఆరు నెలల కాలంలోనే ఆమెకు ప‌ని ఇప్పిస్తామ‌నే నెపంతో దాదాపు 400 మంది వ‌ర‌కు బ‌లవంతంగా అత్యాచారం చేశారంటూ ఆమె ఫిర్యాదు చేయ‌డం పెను సంచ‌ల‌నం రేపుతోంది.వారు ఇలా చేస్తున్నార‌ని పోలీసుల‌కు చెబితే వారు కూడా లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారంటూ వాపోయింది.

కాగా నిందితుల్లో ఇప్ప‌టికే కొంద‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని ఎస్పీ వివ‌రించారు.మిగ‌తా వారి కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube