పిడుగు పాటుకు మేకల కాపారితో పాటు 40 మేకలు మృతి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురవడంతో వ్యవసాయ భూముల్లో వడగళ్ళు పెద్ద ఎత్తున పేరుకుపొయాయి.

ఈ అకాల వర్షం కారణంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మిరప,ఇతర పంటలు దెబ్బతిన్నాయి.

నాగార్జున సాగర్ మండలంలో ఉరుములు,మెరుపులతో కూడిన వడగండ్ల వానతో పిడుగుపడి చింతలతండాకు చెందిన రామవత్ సైదానాయక్ (22) అనే మేకలకాపరి అక్కడిక్కడే మృతి చెందగా,40 మేకలుకూడా మృత్యువాత పడ్డాయి.దీంతో చింతల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

40 Goats Died Along With The Goatherd Due To Lightning-పిడుగు పా

Latest Press Releases News