ఫోటో వైరల్: నవ్వుల చిందిస్తున్న క్యాన్సర్‌ను జయించిన నాలుగేళ్ల చిన్నారి!

క్యాన్సర్ మహమ్మారి బారిన పడితే జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.ఒకసారి క్యాన్సర్ మహమ్మారి బారిన పడితే కోలుకోవడం సులభం కాదు.

కోలుకున్నా కొన్ని సందర్భాల్లో చికిత్స సమయంలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది.ఈ మహమ్మారిని పూర్తిస్థాయిలో జయించడం కూడా సులభం కాదు.

ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డారంటే కొన్ని సంవత్సరాల పాటు చావుబ్రతుకులతో పోరాడినట్లేనని చెప్పాలి.చిన్నపిల్లలు క్యాన్సర్ బారిన పడితే కోలుకోవడం మరీ కష్టం.

అయితే తాజాగా ఒక చిన్నారి క్యాన్సర్ మహమ్మారిని జయించింది.కూతురు తమకు దక్కుతుందో లేదో అని నరకయాతన అనుభవించిన తల్లిదండ్రులు కూతురు మహమ్మరిని జయించిందని తెలిసి ఆనందానికి లోనయ్యారు.

Advertisement

ఆనందంతో కోలుకున్న చిన్నారి ఫోటోలను తల్లి తీయగా సోషల్ మీడియలో నాలుగేళ్ల చిన్నారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.తల్లీ బిడ్డ అనుబంధానికి నిదర్శనంగా ఈ ఫోటోలు నిలుస్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే లూలా బెత్ బౌడెన్ అనే పాప ఒక రకమైన పీడియాట్రిక్ క్యాన్సర్ బారిన పడింది.22 వారాల సమయంలో 13 సార్లు కీమో థెరపీ చేసి వైద్యులు బాలికను రక్షించే ప్రయత్నం చేశారు.‘నేను పోరాడాను.

నేను గెలిచాను అనే పలక పట్టుకుని క్యాన్సర్ ను జయించిన చిన్నారి నవ్వుల వల్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సైతం సంతోషంలో మునిగిపోయారు.లూలా తల్లి ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు