కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యవహార శైలి ఇతర హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస విజయాలు సాధించిన శృతి ఏ విషయంలోనైనా కుండ బద్దలుగొట్టినట్టుగా మాట్లాడుతుంది.
ముక్కుసూటిగా వ్యవహరించే కమల్ తనయ ఏ విషయంలోనైనా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రాధాన్యతనిస్తుంది.ఈ బ్యూటీ ఇతరుల విమర్శలను సైతం పెద్దగా లెక్క చేయదు.
తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శృతి హాసన్ ఈ చిట్ చాట్ లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.సినిమాల గురించి శృతి స్పందిస్తూ సినిమానే జీవితం కాదని… సినిమా అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని చెప్పారు.
తనకు తెలిసిన చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటిస్తే మాత్రమే హీరోయిన్ గా గుర్తింపు ఉన్నట్టు భావిస్తారని… తనకు మాత్రం అలాంటి అభిప్రాయం లేదని తెలిపారు.
బాలీవుడ్ సినిమాలలో నటించడానికి అవకాశాలు రానంత మాత్రాన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చినట్టు కాదని పేర్కొన్నారు.
తెలుగు, తమిళ పరిశ్రమలకే తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది.నచ్చిన స్టైల్ లో నచ్చిన విధంగా జీవిస్తానని ఇతరుల సలహాలను పాటించాల్సిన అవసరం లేదని శృతి వెల్లడించారు.
సౌత్ ఇండియా నటిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నానని మనస్సుకు ఎంతో నచ్చే సినిమాలను మాత్రమే చూస్తానని శృతి తెలిపారు.