యూఎస్ అడవుల్లో విసిరి పడేసిన 220 కేజీల పాస్తా... కారణం ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.

యూఎస్, న్యూజెర్సీలోని( New Jersey ) ఓల్డ్ బ్రిడ్జ్‌ సమీపాన వున్న అడవుల్లో 220 కిలోల పాస్తా కుప్పలు తెప్పలుగా కనిపించడంతో ఇన్ని కేజీల పాస్తా( Pasta ) ఎవరు పడేసారన్న విషయంపైన స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.

దాంతో కొందరు యువకులు సదరు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి.దాంతో న్యూజెర్సీ అడవిలో 500 పౌండ్లు అంటే 220 కేజీల పాస్తాను ఎవరో పడేశారు అన్న విషయం వైరల్ అయింది.

ఆ ప్రాంతంలో నివాసం ఉండే నినా జోచ్నో విట్జ్ అనే వ్యక్తి ఈ పాస్తాను చూడగానే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు సమాచారం.

ఇకపోతే ఈ పాస్తా ఎవరు పడేశారు? వండిందా? లేదా పాడైందా? అనే చర్చలు మొదలయ్యాయి.కేవలం నూడుల్స్ అక్కడ కుప్పలుగా పడి ఉండడం గమనార్హం.ఈ ఫోటోలు వైరల్ అయిన తరువాత ఇద్దరు పబ్లిక్ వర్కర్స్ ఉద్యోగులు పాస్తాను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసినట్టు కూడా తెలుస్తోంది.

Advertisement

ఈ నూడిల్స్ అక్కడ పడివున్న విషయం ఆనోటాఈనోటా చేరి ఆఖరికి పోలీసులకు చేరడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

కాగా, ఎట్టకేలకు ఆ మిస్టరీని కూడా ఛేదించారట.ఈ క్రమంలో వర్షం, తేమ కారణంగా పాస్తా పాడవడంతో ఓ వ్యక్తి అక్కడ పారేశారని తెలుసుకున్నారు.అయితే సదరు వ్యక్తి మాత్రం తన వివరాలు వెల్లడించవద్దని వారికి రిక్వెస్ట్ చేసాడట.

ఈ పోస్టును షేర్ చేసిన నినా జోచ్నో విట్జ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.మొత్తానికి పాస్తా పాడైన కారణంగా అక్కడ పారేశారని మాత్రం తేల్చారు.ఇక ఈ తంతుని సోషల్ మీడియాలో చూసిన పలువురు ఆరోగ్య నిపుణులు మాత్రం పాడైన నూడిల్స్( Noodles ) విషయం దేవుడికెరుకగానీ, అసలు నూడిల్స్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు