ఒకే కాంప్లెక్స్‌లో 22 సార్లు దొంగ‌త‌నం.. లైవ్ గా ప‌ట్టించినా వ‌దిలేసిన జ‌డ్జి..

వ‌రుస‌గా దొంగ‌త‌నాలకు పాల్ప‌డుతున్న వారిని చూసి ఉంటాం.పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన వారు జైలు శిక్ష అనుభవించిన వారు ఉన్నారు.

ఇక్క‌డ మాత్రం ఒక ట్విస్టు ఉంది.ఒక దొంగ ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ చేశాడు.

ఆ దొంగ దొరికితే మామూలుగా ఉండ‌దు అనుకున్నారు.కానీ, సీన్ రివ‌ర్స్ అయింది.

దొంగ దొరికినా శిక్ష ప‌డ‌లేదు.ఇంత‌కు దొంగ ఏమి చేసి ఉంటాడు.అత‌ని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి.

Advertisement

శిక్ష ప‌డ‌క‌పోవ‌డాకి కార‌ణ‌మేంట‌నేవి తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.ఈ తతంగ‌మంతా ఎక్క‌డ జ‌రిగింద‌నుకుంటున్నారా.

యునైటెడ్ సౌత్ ఆఫ్రికాలోని(యూఎస్ఏ) సీటెల్‌లో చోటుచేసుకుంది.సీటెల్‌లోని ఓ సూప‌ర్ మార్కెట్‌లో టీవీ చోరీకి య‌త్నించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ఓ క‌స్ట‌మ‌ర్ ఏకంగా 600 డాల‌ర్ల విలువ‌జేసే 70 ఇంచుల టీవీని తీసుకొస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది.వెంట‌నే బిల్ ఇవ్వ‌మ‌ని అడిగితే టీవీని అక్క‌డే ప‌డేసి పారిపోయే య‌త్నం చేశాడు.

వెంట‌నే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది చాక‌చ‌క్యంతో స‌ద‌రు దొంగ‌ను ప‌ట్ట‌కుని పోలీసులకు అప్ప‌గించారు.దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.టీవీని దొంగిలించిన వ్య‌క్తిని కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా నిర్ధోషిగా ప్ర‌క‌టించారు.55 ఏండ్లు ఉన్న స‌ద‌రు దొంగ జాన్ రే లోమాక్ అని, నిరాశ్ర‌యుడ‌ని విచార‌ణ‌లో తేలగా జడ్జీ నిర్ధోషిగా ప్ర‌క‌టించాడు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

గ‌తంలో కూడా అదే సూప‌ర్ మార్కెట్‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ‌గా సిబ్బంది మంద‌లించి మ‌రోసారి రాకుండా నిషేధించారు.కాగా మూడు నెల‌ల్లో ఒకే సూప‌ర్ మార్కెట్‌లో 22 సార్లు దొంగ‌త‌నానికి య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇందుకు సంబంధించిన వార్త‌పై భిన్న‌మైన వాద‌న వ‌స్తోంది.

Advertisement

ఎందుకంటే చేసింది దొంగ‌త‌నం కాబ‌ట్టి శిక్ష ప‌డాలి క‌దా.చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అనే వాద‌న‌ను నిజం చేయాలంటూ ఒక వ‌ర్గం వాదిస్తోంది.

ఇంకో వ‌ర్గ‌మేమో అత‌ని మీద జాలితో వ‌దిలేయ‌డం క‌రెక్టే అంటూ చెబుతోంది.

తాజా వార్తలు