అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తరువాత సామాన్యుల కంటే ఎక్కువగా కార్పోరేట్ వ్యక్తులకే లాభం చేకూరుతోందని.స్మాన్యుల కోసం చేసింది ఏమి లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి…ఎటువంటి పధకాలు చట్టాలు రూపకల్పన చేసినా సరే అవి ధనిక వర్గాలకి ఉపయోగపడేలా ఉంటున్నాయని విమర్శిస్తున్నారు.
ఇదిలాఉంటే తాజాగా అమలు చేసిన ఓ చట్టం కూడా ఇందుకు నిదర్సనం అంటున్నారు.
అమెరికాలో పన్నుల పై కోత విధించే విషయంలో ప్రభుత్వం కీలక బిల్లుని ఆమోదించింది.గతేడాది ఆమోదించిన పన్నుల్లో కోత, ఉపాధి చట్టానికి(టాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్) రెండవ దశే ఈ బిల్లు.అన్ని స్థాయిల్లో ఆదాయాలు కలిగిన వ్యక్తులకు పన్నుల్లో కోతను శాశ్వతం చేసేందుకు ఈ చట్టం ఉద్దేశించబడింది…అయితే మొదట్లో ఈ బిల్లు పరిమితి దశాబ్ద కాలం వరకే ఈ కోత వుండేది.కానీ
జనవరిలో జరిపిన మార్పుల ప్రకారం చూస్తే కార్పొరేట్ పన్ను 35శాతం నుండి 21శాతానికి తగ్గించారు 2025 ఈ చట్టం అమలు లోకి వచ్చే ఈ బిల్లుని 220మంది కాంగ్రెస్‌సభ్యులు బలపరిచారు.వీరిలో ముగ్గురు డెమోక్రాట్లు వున్నారు.దీనివల్ల 2025 నుండి 2035కి మధ్య జాతీయ రుణ భారం 60వేల కోట్ల డాలర్లు అదనంగా పడనుంది…రాబోయే దశాబ్ద కాలంలో 3లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.అయితే ట్రంప్ చేపట్టిన పన్నుల సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకన్నా సంపన్నులకే సాయపడుతున్నాయని రిపబ్లికన్ నేపనల్ కమిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ప్రజలు సైతం ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.