రోడ్డు ప్రమాదంలో భారత సంతతి చిన్నారుల దుర్మరణం.. నాలుగేళ్ల తర్వాత దోషులుగా తేలిన ఇద్దరు

నాలుగేళ్ల క్రితం నాటి రోడ్డు ప్రమాదంలో( Road Accident ) భారత సంతతి చిన్నారులను పొట్టనబెట్టుకున్న కేసులో ఇద్దరు వ్యక్తులను యూకే కోర్టు దోషులుగా తేల్చింది.

వాల్వర్‌హాంప్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి చిన్నారులు సంజయ్ (10),( Sanjay ) పవన్‌వీర్ సింగ్ (23 నెలలు)లు( Pawanveer Singh ) ప్రాణాలు కోల్పోయారు.

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని ఎడ్జ్‌బాస్టన్‌కు చెందిన మహమ్మద్ సులైమాన్ ఖాన్ (27)( Mohammed Sullaiman Khan ) ర్యాష్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదానికి కారణమైనట్లు నేరాన్ని అంగీకరించాడు.గత వారం వాల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

మరో వ్యక్తి బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్ ఆసిమ్ ఖాన్ (35)( Mohammed Asim Khan ) ఈ కేసుకు సంబంధించి పోలీసులకు అబద్ధం చెప్పినందుకు, విచారణను తప్పుదోవ పట్టించినందుకు కోర్ట్ అతనిని దోషిగా తేల్చింది.

ఈ సందర్భంగా వెస్ట్‌ మిడ్‌లాండ్స్ పోలీస్ సీరియస్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి డిటెక్టివ్ కానిస్టేబుల్ కార్ల్ డెవిస్ మీడియాతో మాట్లాడుతూ.సంజయ్, పవన్‌వీర్ కుటుంబం ఇప్పుడు ధైర్యంగా వుంటారని వ్యాఖ్యానించారు.ఇద్దరు పిల్లలు భయంకరమైన ప్రమాదంలో మరణించిన బాధ చెప్పలేనిదన్నారు.

Advertisement

మార్చి 2019లో వాల్వర్‌హాంప్టన్‌లోని( Wolverhampton ) బర్మింగ్‌హామ్ న్యూరోడ్‌లో చిన్నారులు తమ తల్లితో కలిసి కారులో కూర్చొని వున్నారు.ఇంతలో ఓ ఆడి కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో సంజయ్, పవన్ వీర్ మరణించారు.

ఆ సమయంలో ఆడిని డ్రైవ్ చేస్తున్న మహ్మద్ సులైమాన్ ఖాన్ 90 కి.మీ వేగానికి చేరుకున్నాడని విచారణలో తేలింది.పిల్లలిద్దరూ తమ తండ్రి పనిచేసే ఫిష్ రెస్టారెంట్ నుంచి రాత్రి భోజనం తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చిన్నారులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.వీరి తల్లి అరితి నహార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.ఘటన తర్వాత నిందితుడు సులైమాన్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రమాద ఘటనలో సులైమాన్ ప్రమేయాన్ని కప్పిపుచ్చడానికి అతని సోదరుడు మహ్మద్ ఆసిమ్ ఖాన్ ప్రయత్నించాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

దీనిలో భాగంగా కారు చోరీకి గురైందని కట్టుకథ అల్లాడు.పోలీసుల విచారణలో ఇది అబద్ధమని తేలింది.

Advertisement

న్యాయ విచారణను తప్పుదోవ పట్టించినందుకు గాను ఆసిమ్ ఖాన్‌ను కోర్ట్ దోషిగా తేల్చింది.వీరిద్దరికి త్వరలో శిక్ష ఖరారు చేయనుంది న్యాయస్థానం.

తాజా వార్తలు