యూకే : బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్‌ 2023.. షార్ట్ లిస్ట్ అయిన ఇద్దరు భారత సంతతి రచయితలు

2023 ఏడాదికి గాను బ్రిటీష్ అకాడమీ( British Academy ) బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్‌స్టాండింగ్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయిన వారిలో ఇద్దరు భారత సంతతి రచయితలు చోటు దక్కించుకున్నారు.

వీరిని యూకేకు చెందిన నందిని దాస్, యూఎస్‌కు చెందిన క్రిస్ మంజప్రాగా ( Chris Manjapraga )గుర్తించారు.

వీరితో సహా మొత్తం ఆరుగురు రచయితలు అవార్డ్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.ఈ పురస్కారం కింద 25000 డాలర్లను అందజేస్తారు.

భారత్‌లో జన్మించిన నందినీ దాస్ ‘‘Courting India: England, Mughal India and the Origins of Empire పుస్తకానికి.కరేబియన్ దీవుల్లో జన్మించిన మంజప్రా Black Ghost of Empire: The Long Death of Slavery and the Failure of Emancipation పుస్తకానికి బ్రిటీష్ అకాడమీ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్ అయ్యారు.

ఈ అవార్డ్‌ను ప్రారంభించి 11 ఏళ్లు గడుస్తోంది.నామినేట్ చేయబడిన రచన ఆంగ్లంలో వుండి, యూకేలో( UK ) ప్రచురించబడితే పరిగణనలోనికి తీసుకుంటారు.ప్రపంచ సంస్కృతుల గురించి పరస్పరం అనుసంధానించే మార్గాలపై ప్రజల అవగాహనకు అత్యుత్తమ సహకారం అందించిన నాన్ ఫిక్షన్ పరిశోధన ఆధారిత రచనలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.

Advertisement

ఇకపోతే.నందినీ దాస్( Nandini Das ) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీలో ఎర్లీ మోడరన్ లిటరేచర్ అండ్ కల్చర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.భారత్‌లో పుట్టి పెరిగిన ఆమె కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

అనంతరం ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు.మంజప్రా కెనడాలో పెరిగారు.

ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ గ్లోబల్ స్టడీస్‌లో స్టెర్న్స్ ట్రస్టీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అక్టోబర్ 31న లండన్‌లో జరిగే కార్యక్రమంలో బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్ విజేతను ప్రకటించనున్నారు.

షార్ట్ లిస్ట్ కాబడిన ప్రతి రచయితకు 1000 పౌండ్లను అందజేస్తారు.ఇతర రచయితల విషయానికి వస్తే.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

ఫ్రాన్స్‌కు చెందిన డేనియల్ ఫోలియార్డ్, యూకేకు చెందిన తానియా బ్రానిగన్, స్పెయిన్‌కు చెందిన ఐరీన్ వల్లేజో, అమెరికాకు చెందిన దిమిత్రిస్ జిగలాటాస్‌లు బ్రిటీష్ అకాడమీ బుక్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు.

Advertisement

తాజా వార్తలు