దారుణం : కరోనా మాత్రలని చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి కూతురిపైనే కన్న తండ్రి... 

ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూస్తుంటే ఆడ పిల్లలకి బాహ్య ప్రపంచం లోనే కాదు.

ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

తాజాగా ఓ వ్యక్తి తన మొదటి భార్య కూతురుకి కరోనా వైరస్ ని తగ్గించే మాత్రలని చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే బెంగళూరు పరిసర ప్రాంతంలో 41 సంవత్సరాల కలిగినటువంటి రాకేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

అయితే ఇటీవలే  ఇతడి దగ్గరకి తన మొదటి భార్య కూతురు కొన్ని రోజులు సెలవులు గడిపేందుకు వచ్చింది.అయితే తాజాగా రాకేష్ తన కూతురికి కరోనా వైరస్ నివారించే మాత్రలు అని మభ్యపెట్టి నిద్రమాత్రలు ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.

మత్తులో నుంచి తేరుకున్నటువంటి యువతి తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తెలుసుకొని బోరున విలపించింది.దీంతో వెంటనే తన స్థానిక స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు  కూతురు అని కూడా చూడకుండా ఆమెకి  నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కీచక తండ్రి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెట్టారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు