ఒకే ఒక్కడు సినిమాకాదు .. ఒక్క రోజు ప్రధానమంత్రి !

ఒక్కరోజు ప్రధాని అంటే , అర్జున్ ఒకే ఒక్కడు సినిమా అనుకున్నారా , లేక మేక్ ఎ విష్ కార్యక్రమం కూడా కాదు.

సినిమా కాదు , అలాగని ప్రోగ్రాం కాదు.

నిజమైన నిజం.ఓ 16 అమ్మాయి ఓ దేశానికీ ఒక్కరోజు పీఎంగా భాద్యతలు నిర్వర్తించింది.

ఇంతకీ ఆమె ఎవరు , ఏ దేశానికీ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించింది , ఆ సమయంలో ఆమె ఏం చేసింది అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.ఫిన్లాండ్ ఉత్తర యూరోపియన్ దేశం.

మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, మహిళా సాధికారత ముందంజలో ఉన్న దేశం ఇది.ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశం పేరు మారుమోగుతోంది.దీనికి కారణం ఒకే ఒక్కడు సినిమా సన్నివేశం లాంటిదే నిజంగా జరిగింది ఈ దేశంలో.

Advertisement

ఏకంగా దేశానికి ఒక్కరోజు ప్రధానమంత్రిగా పనిచేసి వార్తల్లోకెక్కారు ఓ అమ్మాయి.ఇప్పటికే 34 ఏళ్ల ప్రాయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా అతి చిన్న వయస్సులో అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా ఖ్యాతి గాంచిన ఫిన్ లాండ్ ప్రదానమంత్రి సనా మారిన్ స్వయంగా.

ఈ 16 ఏళ్ల బాలిక అవా ముర్టోను ఆ పదవిలో కూర్చోబెట్టి.తాను ఓ రోజు విశ్రాంతి తీసుకున్నారు.

బాలికల్లో నైపుణ్యత, ఐటీ రంగంలో అవకాశాల్ని పెంచడం, మహిళలపై ఆన్ లైన్ వేధింపుల సమస్యను ఫోకస్ చేయడం లాంటివి గర్ల్స్ టేకోవర్ క్యాంపెయిన్ లో ప్రదానాంశాలు.ఇందులో భాగంగానే ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్.16 ఏళ్ల అవా ముర్టోకు ప్రధానిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు