కరోనా కేసుల సంఖ్యలో దేశంతో పాటు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్నాయి.ఒక వైపు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన కూడా కరోనాని నియంత్రించే విషయంలో పూర్తిగా ప్రభుత్వాలు విఫలం అయినట్లే కనిపిస్తున్నాయి.
తెలంగాణలో నిన్న ఒక్కరు రోజు 157 కేసులు నమోదుగా అందులో మెజారిటీ భాగం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో లాక్ డౌన్ సడలించిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అనేది చాలా పెద్ద సమస్య.
ఈ నేపధ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి.విద్యార్థులంతా పాస్ అయినట్టు నేడు ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇంటర్నల్ లేదా ప్రీ ఫైనల్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందని అధికారులు అంటున్నారు.ఈ విషయంలో నేటి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం.
ప్రగతి భవన్ లో కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో టెన్త్ పరీక్షల నిర్వహణ అంశమే ప్రధాన అజెండా కానుంది.వైరస్ తగ్గుముఖం పడితే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
అయితే కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది.ఇక హైకోర్టు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరీక్షలు నిర్వహించవద్దని మిగిలిన చోట పెట్టుకోవచ్చని చెప్పింది.
అయిన కూడా ప్రభుత్వం ఈ విషయంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని తెలుస్తుంది.