దహన సంస్కారాలకు 10వేల ఆర్థిక సాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి( Rudrangi ) లో నిరుపేద కుటుంబానికి చెందిన సుకినికంఠ చంద్రమోహన్ ముంబాయిలో కూలీపని చేసుకుంటు జీవనం సాగిస్తున్న క్రమంలో కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్ వెళ్లి చికిత్స జరుగుతుండగానే హఠాత్తుగా రాత్రి మరణించడంతో అక్కడివారు తలాకొన్ని డబ్బులు పొగుచేసి 30వేల రూపాయలు జమచేసి అంబులెన్సులో స్వగ్రామమైన రుద్రంగికి పంపించారు.

అంత్యక్రియలకు కూడా డబ్బులులేని నిరుపేద కుటుంబం అని ట్రస్టు ద్వారా మీకు తోచిన ఆర్థికసాయం అందించండి అని కోరడంతో ట్రస్టు, ఇతరగ్రూపులలో పోస్టు చేయగా దాతలు స్పందించి 8289/- రూపాయలు అందించడంతో ట్రస్టు ద్వారా మరికొంత కలిపి మృతుని భార్య లతకు 10వేల రూపాయల నగదు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, నంది సాయికుమార్, రుద్రంగి పట్టణానికి చెందిన పుట్టపాక జనార్ధన్, దాసు, నాగి ప్రవీణ్, కావ్య తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Latest Rajanna Sircilla News