సమోసా, వడాపావ్ వంటి అనేక ఆహారపదార్థాలతో పచ్చిమిర్చి నములుతారు...ఎందుకో తెలుసా?

మన దేశంలో పచ్చిమిర్చి అంటే ప్రాణం పెట్టేస్తారు.సమోసా, వడాపావ్,ఆవకాయ అన్నంలో పచ్చిమిర్చి నలుచుకొని తినే వారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే ఇలా పచ్చిమిర్చిని తినటం వలన నష్టాలు ఏమైనా ఉన్నాయా లేదా ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.పచ్చిమిర్చి తినటం వలన వంటలకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చిమిర్చిలో విటమిన్ ఎ,సి,కె, ఇ లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.అయితే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవటం వలన అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది.పచ్చిమిర్చి నమిలినప్పుడు ఎక్కువ లాలాజలం ఊరుతుంది.

Advertisement

ఈ లాలాజలం ఆహారం జీర్ణం కావటానికి బాగా సహాయపడుతుంది.పచ్చిమిర్చి ప్రేగుల కదలికను ప్రేరేపించి మాలబద్దకం నివారణలో సహాయపడుతుంది.

అలాగే విష పదార్ధాలను బయటకు పంపుతుంది.పచ్చిమిర్చిలో ఉండే కాప్సయిసిన్ ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేసి మనస్సును ఉల్లాసంగా ఉంచుతుంది.పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.సాధారణంగా మనం విటమిన్ సి సిట్రస్ జాతి పండ్లలోనే ఉంటుందని అనుకుంటాం.

కానీ పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కణజాల మరమ్మత్తు, రక్తకణాలను ఉత్పత్తిచేయటంలోనూ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.మధుమేహాన్ని,కొలస్ట్రాల్ ని కంట్రోల్ ఉంచుతుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు