రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు.

రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.ఈనాడు ఐటీ రంగం గొప్పగా అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదన్నారు.

ఆనాడే టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిన ఘనత త్యాగశీలి రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగం గౌడ్,మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహిబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు గంట బుచ్చగౌడ్, అనవేని రవి, భానొతు రాజు నాయక్, గండికోట రవి, చెన్ని బాబు ,పందిర్ల శ్రీనివాస్, బిపేట రాజు ,రఫీక్, ఎండి ఇమామ్, వంగ మల్లారెడ్డి, పరుశరాములు, గంగయ్య, సురేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News