ఫోలిక్‌ యాసిడ్ లోప‌మా..?అయితే ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే!

మ‌న శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఒక‌టి.

ఈ ఫోలిక్ యాసిడ్‌నే విట‌మిన్ బి9 లేదా ఫోలేట్ అని కూడా పిలుస్తుంటారు.

మెద‌డు చురుగ్గా ప‌ని చేయాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్యలు త‌లెత్త‌కూడ‌ద‌న్నా, శరీరంలో కొత్త కణాలు ఏర్ప‌డాల‌న్నా ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం.అలాగే మహిళ గర్భం పొందిన మొదటి మూడు నెలల్లో బిడ్డ మెద‌డు మరియు నాడీ వ్యవస్థ వృద్ధి చెందాలంటే ఖ‌చ్చితంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.

అయితే స‌రైన అవ‌గాహ‌న లేక చాలా మంది ఫోలేట్ లోపంతో బాధ ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే మందులు వాడుతుంటారు.

కానీ, ప‌లు ఆహారాల నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ పొందొచ్చు.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండే ఆహారాల్లో వేరు శెన‌గ‌లు ఒక‌టి.ప్ర‌తి రోజుగుప్పెడు వేరుశెన‌గ‌లు తీసుకుంటే.

ఫోలిక్‌ యాసిడ్ లోపానికి సులువుగా బై బై చెప్పొచ్చు.

అలాగే బ్రొకోలీలో విట‌మిన్ బి9 స‌మృద్ధిగా ఉంటుంది.అయితే అంద‌రికీ బ్రొకోలీ అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు.కానీ, అందుబాటులో ఉన్న వారు మాత్రం త‌ప్ప‌కుండా బ్రొకొలీని తీసుకుంటే.

ఫోలిక్‌ యాసిడ్ కొర‌త ఉండ‌కుండా ఉంటుంది.ప్రొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఫోలేట్‌కు అద్భుతమైన మూలంగా చెప్పుకోవ‌చ్చు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ విత్త‌నాల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే ఫోలిక్‌ యాసిడ్ లోపం త‌గ్గ‌డ‌మే కాదు.శ‌రీరానికి బోలెడ‌న్ని ఇత‌ర పోష‌కాలు కూడా అందుతాయి.

Advertisement

కిడ్నీ బీన్స్, పింటో బీన్స్‌, బ్లాక్ బీన్స్ మ‌రియు గ్రీన్ బీన్స్ లో ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది.అదేవిధంగా.తోటకూర, పుదీనా, పాలకూర వంటి ఆకు కూర‌ల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది.

ఇక అవ‌కాడో, బొప్పాయి , ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లలో కూడా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, ఈ ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఫోలేట్ లోపానికి దూరంగా ఉండొచ్చు.

తాజా వార్తలు