పట్టణ ప్రగతి,ప్రకృతి వనముల పనులకు ఇచ్చిన కాంట్రాక్ట్ నామినేషన్ రద్దు చేయాలి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 2021-22 సంవత్సరాలకు సంబంధించి పట్టణ ప్రగతి నిధులతో వార్డులలో ప్రకృతి వనాల చుట్టూ పెన్సింగ్ మరియు 14 వ వార్డులో నర్సరీలో మట్టి నింపుటకు పనులు మంజూరు చేస్తూ ఇచ్చిన కాంట్రాక్టర్ పద్మజా ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అనంత శ్రీనివాస్ గౌడ్ వారికి అప్పగించిన పనులు ఆరు నెలలు అవుతున్నా పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి ఆరోపించారు.పట్టణ ప్రకృతి వనరుల కొరకు మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క వార్డులో కూడా ప్రభుత్వ స్థల సేకరణ జరగలేదని,ఏ ఒక్క కౌన్సిలర్ తో కూడా కనీస చర్చ చేయలేదని,ఈ నెల 5వ తేదీన జరిగిన సమావేశంలో మెజారిటీ కౌన్సిలర్లు అందరూ ఈ అంశంపై వ్యతిరేకించామని తెలిపారు.

14వ ఫైనాన్స్ మరియు ఎస్ సి ఎస్ పి నిధులు టెండర్లు పిలవగా టెండర్లు దక్కించుకున్న పద్మజా ఇన్ఫ్రాటెక్ నేటికీ ఎనిమిదో వార్డులో పనులను పూర్తి చేయలేదని ఆరోపించారు.1 2 5 6 వార్డులలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అనంత శ్రీనివాస్ గౌడ్ నాణ్యత లేకుండా నాసిరకం పనులు చేయించి అధికారులను బెదిరించి బిల్లులను ఎత్తుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని,చిన్నచిన్న డ్రైనేజీ పనులను సదరు కాంట్రాక్టర్ ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయలేకపోయినా ఆ కాంట్రాక్టర్ కు ప్రకృతి వనరుల పనులను నామినేషన్ల ద్వారా అనుమతి ఇచ్చి ఏడు నెలలు అవుతున్నా నేటికీ ఏ వార్డులలో స్థల సేకరణ జరగలేదని,పనుల అగ్రిమెంట్ కూడా లేదని తెలిపారు.మున్సిపాలిటీకి 25 లక్షల టెండర్ల పనులను ఇచ్చిన కాంట్రాక్టర్ ను రద్దు చేయాలని మెజారిటీ కౌన్సిలర్లు తమకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని దృష్టిలో పెట్టుకొని ఆదాయం వచ్చే టెండరు ప్రక్రియ ద్వారా పట్టణ ప్రకృతి వనరుల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, నాగయ్య,సుగుణ,సరిత,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి,సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

తాజా వార్తలు