తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే18, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.44

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.43

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.00 ల11.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం

ఈరోజు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.

సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు.వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు.

ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మిథునం:

ఈరోజు రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

గృహమున సంతషంగా గడుపుతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి

కర్కాటకం:

ఈరోజు బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచి వేస్తాయి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతారు.

కన్య:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషానిస్తుంది.విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.పాతబాకీలు వసూలవుతాయి.

బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి.

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

చేపట్టిన పనులు మందాకోడిగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నూతన వాహన యోగం ఉన్నది.ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు.శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలున్నవి.

కుంభం:

ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి.అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది.

వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

తాజా వార్తలు