టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరొకరు అరెస్ట్ అయ్యారు.తాజాగా తిరుపతయ్య అనే వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇదివరకే అరెస్టు అయిన రాజేంద్ర ఇచ్చిన సమాచారంతో తిరుపతయ్యను అరెస్ట్ చేశారని తెలుస్తోంది.దీంతో పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 15 కు చేరింది.కాగా రూ.10 లక్షలకు రాజేంద్ర ఏ ఈ పేపర్ ను కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు.ఈ పేపర్ను తిరుపతయ్య వద్ద నుంచి రాజేంద్ర కొనుగోలు చేశాడని సమాచారం.