ఔను, డ్రస్‌ విప్పితే యాక్టింగ్‌ నేర్పుతానన్నాను.. 20 ఏళ్లుగా అదే చేస్తున్నా తప్పేముంది?

సినిమా ఇండస్ట్రిలో కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేదింపులు ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం.ఎంతో మంది లైంగిక వేదింపుల వల్ల సినిమా ఇండస్ట్రీని సైతం వదిలేసి వెళ్తున్న విషయం తెల్సిందే.

 Train You Acting-TeluguStop.com

అయితే కొందరు సినిమాపై ఆసక్తితో ఆ వేదింపులను అలాగే భరిస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్లక ముందే యాక్టింగ్‌ శిక్షణ కేంద్రంలోనే లైంగిక వేదింపులు ఎదురవుతున్నాయి అంటూ యాక్టింగ్‌ స్కూల్‌ స్టూడెంట్‌ అయిన అంచిత కౌర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

అంచితా కౌర్‌ ఫిర్యాదుపై సూత్రధార్‌ యాక్టింగ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వినయ్‌ వర్మ స్పందించాడు.

తాను యాక్టింగ్‌ ట్రైనర్‌గా 20 ఏళ్లుగా ఉన్నాను.ఈ 20 ఏళ్లలో నేను అందరికి కూడా ఇలాగే యాక్టింగ్‌ నేర్పిస్తున్నాను.

పై దుస్తులు మాత్రమే తీసేయిస్తాను లో దుస్తుల విషయంలో నేను ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు.పై దుస్తులు తీయడానికి ఇష్టపడని వారు బయటకు వెళ్లి పోవచ్చు అన్నాను.

తాను ఎవరిని బలవంతంగా డ్రస్‌ విప్పించలేదు.నటనలో కొన్ని విషయాలను చెప్పేందుకు నేను పై దుస్తులు తొలగించాలని చెప్పాను తప్ప అంతకు మించి ఏమీ లేదని ఆయన అన్నాడు.

ఈ విషయాన్ని ఆమె చాలా పెద్ద ఇష్యూ చేస్తోంది.ఇష్టం లేకుంటే బయటకు వెళ్లి పోవచ్చు అన్నాను.పై దుస్తులు తీసివేసిన తర్వాత తాను ఏ ఒక్కరిని కూడా టచ్‌ చేయను అని, వారికి యాక్టింగ్‌లో శిక్షణ మాత్రమే ఇస్తాను అని, తనను అపార్థం చేసుకున్నారు అంటున్నారు.ఆమె చెప్పింది అంతా నిజమే కాని, నేను తప్పు చేస్తున్నాను అంటే మాత్రం ఒప్పుకోను అంటూ వినయ్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

తాను ఎప్పుడు కూడా తన వద్దకు వచ్చిన వారికి మంచి యాక్టింగ్‌ను నేర్పించాలని చూస్తాను.కాని అంచిత మాత్రం తనను అపార్ధం చేసుకుంది అన్నాడు.కేసు నమోదు చేసిన పోలీసులు వినయ్‌ వర్మను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube