ఉల్లిపాయతో ఇలా చేస్తే ఒక్క రోజులో చుండ్రుకు గుడ్ బై చెప్పేయవచ్చు

ఈ రోజుల్లో చుండ్రు సమస్య లేని వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాలి.ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమస్యతో ఎప్పుడో అప్పుడు బాధ పడుతూనే ఉంటారు.

చుండ్రును శాశ్వతంగా నివారించటం కష్టం.అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా చుండ్రును శాశ్వతంగా దూరం చేయవచ్చు.

చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు ఇప్పుడు చెపుతున్న ఉల్లిపాయ ట్రీట్ మెంట్ ని ఫాలో అయితే ఒక్క రోజులో చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పేయవచ్చు.ఉల్లిపాయలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి.

ఉల్లిపాయ రసంలో ఆర్ధోడాక్స్ అనే పదార్ధం ఉండుట వలన తలలో వున్న బ్యాక్టీరియాను నివారించి.తెల్లగా రాలే పొట్టు సమస్యను తగ్గిస్తుంది.

Advertisement

ఉలిపాయను ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి.

ఈ విధంగా చేయటం వలన తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది.మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు మెంతులలో నీటిని తీసేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ లో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి.కలబంద రసానికి ఉల్లి రసాన్ని కలిపి తలకు పట్టించి తలస్నానము చేస్తే తలలో దురద తగ్గుతుంది.

బీట్ రూట్ దుంపలను ముక్కలుగా కోసి నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టాలి.ఆ నీటిలో ఉల్లిరసాన్ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఆర్జీవీని పటాయించే క్రమంలో వంశీ నాపై కుట్రలు చేశాడు- జేడీ చక్రవర్తి

ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే తలలో దుర్వాసన పోతుంది.ఉల్లిపాయ రసంలో కొంచెం తేనే కలిపి తలకు పట్టించి మునివేళ్లతో కొంచెం సేపు మర్దన చేసి తలస్నానము చేయాలి.

Advertisement

మూడు స్పూన్ల ఉల్లి రసంలో ఐదు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.ఆపిల్ జ్యుస్ లో ఉల్లి రసంను కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తరవాత తలస్నానము చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

తాజా వార్తలు