ఈ కుక్క మామూలుది కాదు.. ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తుంది..

సాధారణంగా ఎంతో కష్టపడితే గాని సంవత్సరానికి కోటి సంపాదించాలేము.కానీ ఒక కుక్క( Dog ) మాత్రం సింపుల్‌గా ఏడాదికి 1 మిలియన్ (రూ.8.27 కోట్లు) డాలర్లు సంపాదిస్తోంది.వినడానికి నమ్మేలా లేదు కదూ.కానీ ఇది నిజం! టక్కర్ బడ్జిన్ అని పిలిచే ఒక గోల్డెన్ రిట్రీవర్( Golden Retriever ) ప్రపంచంలోనే అన్ని డాగ్స్‌లోకెల్లా అత్యంత ఫాలోవర్లను కలిగి ఉంది.సోషల్ మీడియాలో టాప్ డాగ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా టక్కర్ బడ్జిన్( Tucker Budzyn ) రాణిస్తోంది.డబ్బు సంపాదనలో కూడా అన్ని కుక్కల కంటే ఇది ముందుంది.పోర్ట్రెయిట్ కంపెనీ ప్రింటెడ్ పెట్ మెమోరీస్ పరిశోధన ప్రకారం, ఈ వివరాలు తెలిసి వచ్చాయి.

 Meet Tucker Budzyn Dog Earning Millions As Influencer,tucker Budzyn, Golden Ret-TeluguStop.com

టక్కర్ కుక్క 2 ఏళ్ల వయస్సు నుంచి స్పాన్సర్డ్‌ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తోంది.ఒక మీడియాతో ఈ కుక్క యజమాని మాట్లాడుతూ.“యూట్యూబ్-పెయిడ్ పోస్ట్( YouTube Paid Post ) 30 నిమిషాల ప్రీ-రోల్‌తో మేం రూ.28 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు డబ్బులు సంపాదిస్తాం.ఇన్‌స్టాగ్రామ్‌లో మేం మూడు నుంచి ఎనిమిది స్టోరీలకు దాదాపు రూ.10 లక్షలు సంపాదిస్తాము.” అని చెప్పి అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశారు.

కోర్ట్నీ, మైక్ తమ కుక్క టక్కర్ సోషల్ మీడియా ఖాతాలను ఫుల్ టైం మేనేజ్ చేయడానికి ఏకంగా తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు.టక్కర్ ఐస్ క్యూబ్‌పై తన కాళ్లు కదుపుతున్న వీడియోను వీరు కొంతకాలం క్రితం పోస్ట్ చేశారు.ఆ ఒక్క వీడియోతోనే ఈ కుక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్‌గా మారింది.

ఈ కుక్క పేజీకి ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో 25 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube