అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయి ... పోలీసులు ఏం చేసారో చూస్తే ఆశ్చర్యపోతారు

మిగితా విషయాల్లో స్త్రీల కంటే పురుషుల కి ఎక్కువ ముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కాని, న్యాయ సంబంధిత విషయాల్లో మాత్రం స్త్రీలకి ఉండే వెసులుబాట్లు, అడ్వాంటేజ్ లు మగవారికి లేవు.

ప్రయాణించే బస్సులో అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి ఓ అమ్మాయి మీద ఓ అబ్బాయి పడినా తప్పే, దాన్ని కూడా ఈవ్ టీజింగ్ లేదా లైంగిక వేధింపుల కేసు కింద జమకట్టి అరెస్టు చేయవచ్చు.

ఇలాంటి విషయాల్లో సమాజం ముందు ఎప్పుడు, పురుషుడే దోషి.తప్పు ఉంటే అతడిదే ఉంటుంది తప్ప ఆమెది ఉండదు.

అబద్ధం ఆడితే అతడే ఆడతాడు తప్ప, ఆమె ఆడదు.న్యాయవవస్థలో స్త్రీలకి అనుకూలంగా ఉండే ఎన్నో లోసగులను వాడుకుంటూ, నకిలీ వరకట్న వేధింపుల కేసులు, లైంగిక వేధింపుల కేసులు పెట్టేవారు ఎంతమందో.

ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో అచ్చం ఇలాంటి పనే చేయబోయింది ఓ అమ్మాయి.కాని రివర్స్ లో ఆమెకే శిక్ష పడింది.ఆ కథాకామీషు ఏంటో చూడండి.22 ఏళ్ల సోఫీ పైనటన్ ఓ రోజు రాత్రి ఓ హోటల్ లో తన స్నేహితులతో బాగా తాగేసింది.ఇంటికి బయలుదేరుతూ ఓ ట్యాక్సీ ఎక్కింది.

Advertisement

ఇంటి దాకా డ్రాప్ చేసిన తరువాత కబాబ్ నూనే బాగా అంటి, కాస్త పాడైన 10 యూరోల నోటు ఆ ట్యాక్సీ డ్రైవర్ కి ఇవ్వబోతే ఆ నోటు తీసుకోవడానికి అతడు నిరాకరించాడు.దాంతో సోఫీ అతడి మీద బూతుల పురాణం మొదలుపెట్టిందట.

తీసుకుంటావా నీ మీద కేసు వేయమంటావా అంటూ బెదిరించిందట.తప్ప తాగి ఉన్న అమ్మాయి ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడుతుందని ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆమెని అలానే వదిలేసి వెళ్ళిపోయాడు.

మరునాడు అతడికి ఊహించని షాక్ తగిలింది.ట్యాక్సీలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా దాడి చేసాడని అతడిపై కేసు వేసింది ఆ అమ్మాయి.

ట్యాక్సీ డ్రైవర్ ని పిలిపించి ఆరు గంటల పాటు విచారించారు పోలీసులు.ఇంకేముంది, ఆ మగమనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినిపించుకోకుండా, తప్పు నిజంగానే చేసాడా లేదా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, మగవాడు కాబట్టి తప్పు చేసే ఉంటాడు అని అరెస్టు చేసి ఉంటారు అనుకునేరు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

ఇండియాలో అయితే అలానే జరిగేది ఏమో.ఆ ట్యాక్సీ డ్రైవర్ ఓ ముస్లీం.అయిదుగురు పిల్లలు ఉన్నారు.

Advertisement

ఈ 22 ఏళ్ల అమ్మాయి తన కూతురు వయసులో ఉంది.అలాంటి అమ్మాయితో నేనెందుకు చెడుగా ప్రవర్తిస్తాను, ఆ అమ్మాయి ఇలా తప్పుడు కేసు పెట్టడం వలన నన్ను మతం లోంచి వెలివేయాలి అనుకుంటున్నారు మతపెద్దలు, చుట్టాలకి మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కావడం లేదు, కేవలం పాడైన నోటు తీసుకోనందుకు ఇంత చేసింది అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

ఆ అమ్మాయిని పిలిపించి ప్రశ్నావళితో కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి తన నోటి నుంచి నిజాన్ని కక్కించారు.తండ్రి వయసు ఉన్న ట్యాక్సీ డ్రైవర్ ని తప్పుడు కేసులో ఇరికించబోయి, రివర్స్ లో తానే కేసులో చిక్కుకుంది.

ఒక వ్యక్తిపై తప్పుడు కేసు వేసి పరువు తీసేందుకు ప్రయత్నించింది అనే నెపంతో ఈ అమ్మాయికి 16 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.

తాజా వార్తలు