ఇండియా- పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ కోసం 4 లక్షల దరఖాస్తులు!

ఇండియా-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత హై వోల్టేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శత్రు దేశాలుగా వున్నా ఈ రెండింటి మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాలలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

ఎవరు ఓడిపోయిన ఆ దేశంలో క్రికెటర్స్ పై వారం రోజుల పాటు తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది.ఇక ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ వుంటారు.

ఇక ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఐసిసికి కాసుల పంటే అని చెప్పాలి.విపరీతంగా ఎండార్స్మెంట్స్ వస్తాయి.

ఇదిలా వుంటే ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ కప్ క్రికెట్ జరగనుంది.ఇందులో ఒకే గ్రూప్ లో పాకిస్తాన్ ఇండియా వుండటంతో ప్రత్యర్ధులుగా ఓ మ్యాచ్ లో తలపడనున్నాయి.

Advertisement

భారత్- పాకిస్తాన్ మధ్య జూన్ 16న మాంచెస్టర్ వేదికగా మ్యాచ్ జరగనుంది.అయితే చాలా గ్యాప్ తర్వాత మరల భారత్, పాకిస్తాన్ క్రికెట్ లో ఎదురెదురు తలపడటం వలన ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇంగ్లాండ్ లో భారీగా టికెట్స్ కోసం దరఖాస్తులు వచ్చాయి.

ఈ విషయాన్ని ఐసిసి అధికారికంగా ప్రకటించింది.ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సుమారు 4 లక్షల దరఖాస్తులు టికెట్స్ కోసం వచ్చాయని ప్రకటించారు.

అయితే మాంచెస్టర్ లో లో మ్యాచ్ జరిగే స్టేడియం కెపాసిటీ కేవలం 25 వేలు మాత్రమె కావడం వలన దరఖాస్తులు చాలా వరకు రిజక్ట్ చేసామని ఐసిసి ప్రకటించింది.మొత్తానికి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి ఇంగ్లాండ్ లో కూడా ఎ స్థాయిలో డిమాండ్ వుందో తాజాగా ఐసిసి ప్రకటనతో మరోసారి రుజువైంది అని చెప్పాలి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు