ఆడవాళ్లు మద్యం తాగితే పరిస్థితి ఏంటీ? ఉపయోగంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి

ఆల్కహాల్‌ అనేది మితంగా తీసుకుంటే ఔషదంగా పని చేస్తుంది, అమితంగా తీసుకుంటే విషం అవుతుందనేది డాక్టర్ల వాదన.

ఆల్కహాల్‌ వల్ల ఎన్నో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, ఇతరత్ర కారణాల వల్ల ఆడవారు కూడా ఆల్కహాల్‌ తీసుకునే పరిస్థితి వచ్చింది.ముఖ్యంగా అమ్మాయిలు ఈమద్య కాలంలో ఎక్కువగా ఆల్కహాల్‌ తీసుకుంటున్నట్లుగా సర్వేలో వెళ్లడయ్యింది.

ఇండియాలో అమ్మాయిలు ఆల్కహాల్‌ తీసుకునే వారి కంటే పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిలు ఎక్కువగా తీసుకుంటున్నారని వెళ్లడయ్యిందది.

అమ్మాయిలు మద్యం తాగడం వల్ల ఉపయోగాలు : వారంలో ఒకటి లేదా రెండు సార్లు అమ్మాయిలు మద్యం తాగడం వల్ల వారిలో ఉన్న పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా మద్యం వల్ల లాభం ఉంటుందని అంటున్నారు.టెన్షన్‌ కారణంగా మెదడు మొద్దుబారి పోతుందని, వారు మితంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజబరింతంగా పని చేస్తుందని అంటున్నారు.మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి కూడా మద్యం మితంగా తాగడం వల్ల తగ్గుతుందని చెబుతున్నారు.అమ్మాయిలు మద్యం తాగితే నష్టాలు :

అమ్మాయిలు వారంలో అయిదు కంటే ఎక్కువగా తాగడం వల్ల జీర్ణశయంలో సమస్యలు ఏర్పడుతాయి.మహిళలు ఎక్కువగా మద్యం తాగడం వల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.మహిళల్లో ఆల్కహాల్‌ వల్ల అండం ఉత్పత్తి ప్రభావం ఉంటుందని అంటున్నారు.

ఒకవేళ గర్బం దాల్చినా కూడా అబార్షన్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని గైనకాలజిస్ట్‌లు అంటున్నారు.ఆల్కహాల్‌ అలవాటు ఉన్న మహిళల పాలు కూడా మంచిది కాదు.

బిడ్డలకు పాలిచ్చే తల్లి మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు