పెళ్లికూతురుని గంపలో ఎందుకు తీసుకువస్తారు?

మన హిందూ సంప్రదాయంలో వివాహం సమయంలో పెళ్లి కూతురుని గంపలో తీసుకురావటం అనేది ఒక సంప్రదాయంగా ఉంది.

అయితే ఈ సంప్రదాయం కొంత మందికి మాత్రమే ఉంది.

అసలు పెళ్లికూతురుని గంపలో ఎందుకు తీసుకువస్తారు? ఆ వివరాల్లోకి వెళ్ళితే.ఈ సంప్రదాయం వెనక గొప్ప అర్ధం ఉంది.

సాధారణంగా ఆడపిల్ల పుట్టగానే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అంటారు.అలాగే సిరి సంపదలు కూడా ఆ ఆడపిల్ల వలనే వచ్చాయని నమ్ముతారు.

ఆడపిల్లను అత్తారింటికి పంపటం అంటే సంపదలను ఇవ్వటమే.సంపదల తల్లి లక్ష్మి దేవి తామర పువ్వులో ఉంటుంది.

Advertisement

అటువంటి మా ఇంటి మహాలక్ష్మిని తామరపువ్వు వంటి గంపలో పెట్టి పెళ్లి మండపానికి తీసుకువస్తారు.ఈ విషయాన్ని వరుడికి అర్ధం కావటానికి పెళ్లికూతురును గంపలో పెళ్లి మండపానికి తీసుకువస్తారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు