అఖిల్‌ టీజర్‌.. సల్మాన్‌ ఖాన్‌

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం ‘అఖిల్‌’ సినిమా టీజర్‌ను నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

ఈ టీజర్‌ను బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

సల్మాన్‌ ఖాన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ కారణం చేతే ‘అఖిల్‌’ టీజర్‌ను సల్లూ భాయ్‌ రిలీజ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

చాలా రోజులుగా అఖిల్‌ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.వినాయక్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నితిన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గతంలో ఏ హీరోకు కూడా దక్కని భారీ ఎంట్రీ అఖిల్‌కు ‘అఖిల్‌’ సినిమా ద్వారా దక్కనుంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్ముడు పోయింది.

Advertisement

నేడు టీజర్‌ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.ఇక ఈ సినిమా ఆడియోను వచ్చే నెలలో విడుదల చేసి, దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు