రామ్ చరణ్ రాకుల్ కి సెట్లో ఎప్పుడు అదే పని

రామ్ చరణ్ ని చూడండి ఎలా ఉంటాడో.తగ్గకుండా, పెరగకుండా అన్నట్టుగా, పర్ఫెక్ట్ షేప్ లో ఉంటాడు.

ధృవ ట్రైలర్ లో చూసారుగా.ఆ బాడి ఓవర్ గా ఉండదు, అలాగని కామెడీగా ఉండదు.

సరైన కొలతలతో ఉంటుంది.ఆ బాడీని చూస్తేనే అర్థమైపోవాలి మీకు చరణ్ ఫిట్ నెస్ కి ఎంత సమయం కేటాయిస్తాడో, ఎంత ప్రాధాన్యతనిస్తాడో.

ఇక రకుల్ ప్రీత్ సంగతి సరేసరి.షూటింగ్ లో లేదంటే జిమ్ లోనే ఉంటుంది.

Advertisement

తనకి జిమ్ అంటే పిచ్చి.అందుకే హైదరాబాద్ లో సొంతంగా ఒక జిమ్ కూడా నడుపుతోంది.

ఈ భామకి కూడా ఫిట్ నెస్ అంటే అంత పిచ్చి కాబట్టే, ఎప్పుడు రకుల్ లావేక్కింది అనే కామెంట్స్ రాలేదు.మరి ఈ ఇద్దరు ఫిట్ నెస్ పిచ్చోళ్ళు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది.

ధృవ షూటింగ్ జరుగుతున్నంత కాలం, చరణ్, రకుల్ కలిసి మాట్లాడుకుంటే, అది కేవలం ఫిట్ నెస్ గురించే అంటా.వర్కవుట్స్ గురించి, డైట్ గురించి, ప్రోటీన్ ఇంటేక్ గురించి, ఇలా అన్ని ఫిట్ నెస్ టాపిక్స్ మీద చర్చించేవారట.

వీరి సంభాషణలు గమనించనవారు "అబ్బా ఎప్పుడు అదే పనా" అంటూ విసుకున్నా, ఈ ఇద్దరి ప్రపంచం ఇద్దరిదే.

ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?
Advertisement

తాజా వార్తలు