ఎమ్మెల్యే గా రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ ఏంటీ .

ఎమ్మెల్యే ఏంటి, సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది కాదా, మళ్ళీ ఈ పొలిటిక్స్ పిచ్చేంటి అనుకుంటున్నారా ! అవును హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది, అయితే నిజజీవితంలో కాదు.

అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరైనోడు మూవీలో రకుల్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ మూవీలో రకుల్ రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర పోషించబోతోంది.

ఒక నియోజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ సభ్యురాలిగా రకుల్ కనిపించబోతుందట.తన వయసుకి తగ్గ పాత్ర కాకపోయినా, ఆ పాత్రలో ఉన్న షేడ్స్ చాలా ఛాలెంజింగ్ గా ఉండటంతో రకుల్ ఈ పాత్ర పోషించేందుకు ఒప్పుకుంది.

ఇంతవరకు గ్లామర్ రోల్స్ లోనే కనిపించిన రకుల్ తొలిసారిగా కొత్త క్యారెక్టర్ లో కనిపించనుంది.ఏమేరకు మెప్పిస్తుందో, జనాలు ఎంతవరకు ఆదరిస్తారో వచ్చే ఏడాది చూడాల్సిందే.

Advertisement
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

తాజా వార్తలు