కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో అనుష్క మెరవనున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే.
ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు సోగ్గాడి చిత్రంలో ఒక పాటలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.అనుష్కకు టాలీవుడ్‌కు పరిచయం చేసింది నాగార్జున అనే విషయం తెల్సిందే.
ఆ విశ్వాసంతోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికి నాగార్జున నటిస్తున్న చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటిస్తోంది.
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో రమ్యకృష్ణ మరియు లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న విషయం తెల్సిందే.
వీరిద్దరితో పాటు హాట్ యాంకర్ అనసూయ మరియు హంసా నందినిలు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు.ఇంత మంది ముద్దుగుమ్మలు ఉండగా సినిమాకు మరింత గ్లామర్‌ను అందేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలోని ఒక పాటలో అనుష్కను చూపించనున్నట్లుగా తెలుస్తోంది.
అనుష్క ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.వచ్చే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.







