నివేదాపై మనసు పడ్డ నాని..!

నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నాడు.

రీసెంట్ గా మజ్నుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చేస్తున్నాడు.

డిసెంబర్ కల్లా ఆ సినిమాను కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు.ఇక కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుండే నాని శంకర్ లాలం అనే న్యూ టాలెంటెడ్ డైరక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడట.

ఇప్పటికే శంకర్ కథకు ఓకే చెప్పిన నాని త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట.ఇక ఆ సినిమాలో హీరోయిన్ కు కూడా ప్రాధాన్యత ఉండటంతో తనతో జెంటిల్మన్ సినిమాలో అదరగొట్టిన నివేదా థామస్ ను తీసుకోమని నాని గైడ్ చేశాడట.

జెంటిల్మన్ సినిమాలో నానికి పోటీగా నటించి అందరి మెప్పు పొందిన నివేదా తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటుంది.ప్రస్తుతం నవీన్ చంద్ర సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నివేదా నాని సినిమాలో మరో ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తుంది.

Advertisement

మరి ఈ జెంటిల్మన్ జంట ఎలా అలరించనుందో చూడాలి.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెళ్లడవుతాయి.

ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?
Advertisement

తాజా వార్తలు