మెగా ఐటెం కి రాయి లక్ష్మి పారితోషకం.!-Mega Item Girl Rai Lakshmi Highly Demand 3 months

Khaidi No.150 Item Song Lakshmi Rai Mega Remuneration Rs 40 Lakhs మెగా ఐటం అంత డిమాండ్..! Photo,Image,Pics-

మెగాస్టార్ ఖైది నెంబర్ 150లో చిరుతో స్టెప్పులేసే అదృష్టాన్ని మిస్ చేసుకున్న కేథరిన్ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కాని ఆమె ప్లేస్ లో వచ్చిన రాయ్ లక్ష్మి మాత్రం ఫుల్ ఖుషిగా ఉంది. అడపాదడపా కనిపించే అమ్మడు ఏకంగా మెగాస్టార్ తో స్టెప్పులేసే ఛాన్స్ అంటే అది కచ్చితంగా అదరగొట్టే ఆఫరే. లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ కోసం కేథరిన్ సడెన్ గా ఎక్సిట్ అవగా నిర్మాత రాం చరణ్ రాయ్ లక్ష్మిని కన్సల్ట్ అయ్యాడట. కేవలం లారెన్స్ వి ఐదు రోజులే డెట్స్ తీసుకోవడంతో ఆమె అడిగినంత ముట్ట చెప్పారట.

ఇంతకీ రాయ్ లక్ష్మి ఆ సాంగ్ కోసం ఎంత తీసుకుంది అంటే 40 లక్షలని తెలుస్తుంది. ఏంటి అంతనా అని నోరెళ్ల పెట్టేయొచ్చు. ఓ పక్క తమన్నా కాజల్ లాంటి హీరోయిన్సే ఐటం సాంగ్స్ కు 50 లక్షలు తీసుకుంటుంటే ఏమాత్రం క్రేజ్ లేని రాయ్ లక్ష్మికి ఎందుకు అంత అంటే, మెగా ఐటం అనగానే ఆమెకు డిమాండ్ పెరిగింది అదిగాకా అనుకున్న డేట్స్ ప్రకారం ఆమె అయితేనే కరెక్ట్ అని తీసుకున్నారట. ఈ మధ్యనే ఆ సాంగ్ తాలూఖ పిక్స్ బయటకు వచ్చాయి. చిరు పక్కన రాయ్ లక్ష్మి అదరగొడుతుంది. మరి అమ్మడి ఫేట్ ఈ సాంగ్ తో అయినా మారుతుందేమో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్లో జూలీ సీక్వల్ గా వస్తున్న జూలీ-2 లో హాట్ హాట్ గా కనిపించబోతుంది రాయ్ లక్ష్మి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..మెగా ఐటెం కి రాయి లక్ష్మి పారితోషకం.!

This Post provides detail information about మెగా ఐటెం కి రాయి లక్ష్మి పారితోషకం.! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Lakshmi Rai, Remuneration, Rs 40 Lakhs, Khaidi No.150 Item Song, Chiranjeevi, Mega Item, మెగా ఐటం అంత డిమాండ్..!

Tagged with:Lakshmi Rai, Remuneration, Rs 40 Lakhs, Khaidi No.150 Item Song, Chiranjeevi, Mega Item, మెగా ఐటం అంత డిమాండ్..!chiranjeevi,Khaidi No.150 Item Song,lakshmi rai,Mega Item,remuneration,Rs 40 Lakhs,మెగా ఐటం అంత డిమాండ్..!,,