ఇండియాలో టాప్ మొబైల్ బ్రాండ్ ర్యాంకింగ్స్ ఇవే

గత నాలుగైదు నెలలుగా చైనా ఉత్పత్తులు కొనొద్దంటూ వాట్సాప్ లో, ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో, ఎక్కడపడితే అక్కడ హంగామా చేసారు జనాలు.

కాని ఒక చేత్తో పోస్ట్ పెట్టి, మరో చేత్తో చైనా బ్రాండ్స్ నే కొన్నట్టున్నారు.

అందుకేగా భారతదేశంలో మొబైల్ ఇండస్ట్రీని చైనా కంపెనీలు రాజ్యం ఏలుతున్నాయి.లెటేస్ట్ మొబైల్ మార్కేట్ షేర్ ర్యాంకింగ్స్ లో ఒక్కటంటే, ఒక్క భారతీయ మొబైల్ కంపెనీ లేదంటే నమ్మండి.ఇంటర్నేషనల్ రీసెర్చ్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ఫలితాల ప్రకారం 2016 నాటికి ఇండియాలో టాప్ మార్కేట్ షేర్ మొబైల్ కంపెనీలు ఇవే.1) సాంసంగ్ - 25.10% 2) షియోమి రెడ్ మీ - 10.70% 3) లెనోవో గ్రూప్ (మొటొరొలా కలిపి) - 9.90% 4) ఒప్పో - 8.60% 5) వివో - 7.60% ఈ లిస్టులో సాంసంగ్ మినహా, మిగితావన్ని చైనా కంపెనీలే.2015 దాకా రెండొవస్థానంలో కొనసాగిన భారతీయ కంపెనీ మైక్రోమ్యాక్స్ టాప్ 5 నుంచి వెళ్ళిపోవడం బాధకరమే.గట్టిగా అలోచిస్తే వినియోగదారులకి కావాల్సింది తక్కువ రేటులో ఎక్కువ వసతులు.

చైనా బ్రాండ్స్ అన్ని తక్కువ రేటులో క్వాలిటి ఫోన్స్ అందిస్తుండటంతో వాటికి ఎదురులేకుండా పోతోంది.సాంసంగ్ టాప్ లో ఉన్నా, దాని మార్కేట్ షేర్ కిందికే వస్తోంది తప్ప పైకి ఎక్కట్లేదు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు