మహేష్ గాలి తీసేసిన చిరంజీవి

ఇప్పటిదాకా బాహుబలి తరువాత అతిపెద్ద బ్లాక్బస్టర్ తన పేరిట ఉన్నట్లే కాని, మహేష్ బాబు ఫామ్ అంత గొప్పగా ఏమి లేదు.

గత నాలుగు చిత్రాల్లో మూడింటిని ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.

తన స్థాయికి తగ్గట్టుగా వచ్చిన ఒకే సినిమా శ్రీమంతుడు రికార్డులను సృష్టిస్తే, ఇప్పుడు ఆ రికార్డులన్ని తన పేరిట రాసేసుకున్నాడు మెగాస్టార్.అయిపోయింది, మిషన్ పూర్తయిపోయింది.

వచ్చి రావడంతోనే శ్రీమంతుడు టోటల్ కలెక్షన్ రికార్డుని బద్దలు కొట్టేసాడు మెగాస్టార్.బాహుబలి తరువాత అతిపెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకోని, 85-86 కోట్ల షేర్ సాధించిన శ్రీమంతుడిని నిన్నటిరోజు మూడొవ స్థానానికి నెట్టేసాడు.

నాన్ - బాహుబలి ఇండస్ట్రీ హిట్ అంటారో లేక సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అని అంటారో కాని, చిరంజీవి తనలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.తెలుగు సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించారు.

Advertisement
ఇంతకీ ఆ ముంబై భామలు తెలుగు సినిమాలు చేస్తారా?

తాజా వార్తలు