రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేసీఆర్ కొత్త స్కెచ్‌

తెలంగాణ‌లో టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్ పోరు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

సీఎం కేసీఆర్ ప్ర‌సంగం ఎంత ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుందో రేవంత్ ప్ర‌సంగం సైతం అంతే స్థాయిలో ఆస‌క్తిగా ఉంటుంది.

ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేసే టైంలో కేసీఆర్‌, రేవంత్ పిట్ట‌క‌థ‌లు చెపుతూ సెటైర్ల‌తో ఏకిప‌డేస్తారు.ప‌దే ప‌దే త‌న‌ను, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోన్న రేవంత్‌రెడ్డిని క‌ట్ట‌డి చేసేందుకు కేసీఆర్ వీలున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు.

రేవంత్‌ను ఓటుకు నోటు కేసులో ఇరికించడం వెన‌క కేసీఆర్ ప్లాన్ ఉంద‌న్న టాక్ ఉంది.ఇక రేవంత్‌కు కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మీద ప‌ట్టులేకుండా చేసేందుకు ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏకంగా మూడు జిల్లాల ప‌రిధిలోకి విడ‌గొట్టారు.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ గెల‌వ‌కూడ‌ద‌ని.రేవంత్ ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌కూడ‌ద‌ని కేసీఆర్ ఎత్తులు వేస్తున్నాడ‌ట‌.

Advertisement

ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజా స‌ర్వే ఫ‌లితాల్లో కొడంగ‌ల్‌లో సైతం టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని చెప్పారు.ఇక కొడంగ‌ల్ ఇప్ప‌టికే మూడు జిల్లాల ప‌రిధిలోకి వెళ్లేలా చేసిన ఆయ‌న జూలైలో జ‌రిగే డీ లిమిటేష‌న్‌లో కొడంగ‌ల్‌ను ఎస్సీల‌కు చేయించే ప్ర‌య‌త్నాలు కూడా తెర‌వెన‌క చేస్తున్నార‌ట‌.

అదే జ‌రిగితే రేవంత్ మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వెతుక్కోక త‌ప్ప‌దు.కేసీఆర్ ఎత్తులు ప‌సిగ‌డుతోన్న రేవంత్ సైతం త‌న ప్లానుల్లో తాను ఉన్న‌ట్టు టాక్‌.

కొడంగ‌ల్ ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయినా లేదా తాను వచ్చే ఎన్నిక‌ల్లో వికారాబాద్ జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం లేదా టీఆర్ఎస్ ప్ర‌భావం త‌క్కువుగా ఉన్న క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.ప్ర‌స్తుతం క‌ల్వ‌కుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద‌ర్‌రెడ్డి ఉన్నారు.

కేసీఆర్ తాజా స‌ర్వేలో ఈయ‌న మ‌ళ్లీ గెలుస్తార‌ని తేలింది.మ‌రి రేవంత్‌ను టార్గెట్ చేసేందుకు కేసీఆర్ వేసిన స్కెచ్ ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు