ఓపెనర్ లేకుండా బీర్ బాటిల్ ఓపెన్ చేసే ట్రిక్స్ ఇవిగో

వోడ్కా అయినా, విస్కీ అయినా, బాటిల్ మూత ఓపెన్ చేయడం మరీ అంత కష్టం కాదు.

ఓ చిన్నిపాటి స్టికర్ ని తీసేస్తే, ఫస్ట్ క్లాస్ పిల్లాడు కూడా కష్టం లేకుండా తీసేస్తాడు.

కాని బీర్ బాటిల్ మూత అలా కాదుగా.తీయడం కష్టం.

ఓపెనర్ ఉంటే తప్ప సులభతరం కాదు.కొందరు ఓపెనర్స్ లేకున్నా తమ దంత బలంతో బీర్ బాటిల్ మూత అలవోకగా తీసేస్తారు కాని బ్యాచ్ లో అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు.

వాడు ప్రతి పార్టీకి అందుబాటులో ఉండడుగా.అదీకాక సీక్రెట్ గా బీర్ కొట్టాలనుకున్నప్పుడు కుర్రాళ్ళు బీర్ మూత తీయడానికి పడే తంటాలు మామూలుగా ఉండవు.

Advertisement

అందుకే బీర్ బాటిల్ మూతను తీయగలిగే కొన్ని ట్రిక్స్ ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం.* ఒక బీర్ బాటిల్ తో మరో బీర్ బాటిల్ ని ఓపెన్ చేయొచ్చు తెలుసా ? రెండు బీర్ బాటిల్స్ ఒకే చేతిలో పట్టుకోండి.ఒక బీర్ బాటిల్ మూత కింద మరో బీర్ బాటిల్ మూత ఉండేలా పట్టుకోండి.

కాస్త స్టడీగా, కొంచెం బలం ఉపయోగించి టేబుల్ మీద కింది బాటిల్ ని దింపండి.కింది బాటిల్ ఫోర్స్ తో పై బాటిల్ మూత వచ్చేస్తుంది.* సింపుల్ ఒక రూపాయి కాయిన్ తో కూడా బీర్ మూత తెయోచ్చు.

కాని ఇది కొంచెం కండబలం ఉన్నవారికే సాధ్యపడే విషయం.ఎందుకంటే మణికట్టులో బలం ఉంటే తప్ప మూత బయటకి రాదు.

* చేతికి రింగ్ ఉంటే కూడా బీర్ బాటిల్ మూత తీయొచ్చు.రింగ్ బయటకి తీయాల్సిన అవసరం కూడా లేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

చేతిని మూత పై ఆనిపించి, రింగ్ మూత కింది భాగంపై ఒత్తిడి పెంచేలా పొజిషన్ చేయండి.ఇప్పుడు స్మూత్ గా మీ బలాన్ని ఉపయోగించి చేతిని పైకి లేపండి.

Advertisement

* బెల్టు ఉంటుందిగా.ఆ బెల్ట్ మధ్యలో ఉన్న ముళ్ళు కాస్త పక్కకి జరిపి, ఆ సందులో మూతను ఇరికించండి.

అచ్చం ఓపెనర్ తో ఓపెన్ చేసేటప్పుడు తెచ్చే ప్రెషర్ తీసుకురండి.చాలా సులువుగానే మూత ఓపెన్ అయిపోతుంది.

* కత్తి ఉంటే చాలా ఈజీ తీయడం.బాటిల్ లో అడ్డంగా చేతిలో పట్టుకొని, సొరకాయ పొట్టు తీయాలనుకునప్పుడు ఎలాగైతే సన్నగా కత్తిని తిప్పుతారో, అలానే సరిగ్గా బీరు మూత మీద మీ కత్తి ఫోర్స్ పడేలా తిప్పండి.

మూత ఇట్టే వచ్చేస్తుంది.* ఇంకా చెప్పాలంటే ప్లాస్టిక్ బాటిల్ మూతతో, బండి తాళాలతో, లైటర్ వెనుక భాగం ఉపయోగించి కూడా బీర్ మూతను తీయవచ్చు.

తాజా వార్తలు